Share News

అమెరికాలో విషాదం.. ఉద్యోగం రాదేమోనని కర్నూలు యువకుడి ఆత్మహత్య..

ABN , Publish Date - May 01 , 2026 | 09:31 AM

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

అమెరికాలో విషాదం.. ఉద్యోగం రాదేమోనని కర్నూలు యువకుడి ఆత్మహత్య..
Chandu USA

న్యూయార్క్, మే 1: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగం రాదేమోనన్న భయంతో కర్నూలుకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. కర్నూలుకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు.. అమెరికా, షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, అమెరికాలో మారిన పరిస్థితుల కారణంగా ఉద్యోగం రావటం కష్టంగా మారింది.


అవసరాల కోసం కుటుంబసభ్యులపై ఆధారపడాల్సి వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవటం.. ఖర్చుల కోసం కుటుంబసభ్యుల మీద ఆధారపడాల్సి రావటంతో చందు మనస్తాపం చెందాడు. ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 28వ తేదీన అపార్ట్‌మెంట్ గదిలో తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చందు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తానా టీం స్క్వేర్ కోఛైర్ చిరంజీవి గల్లా.. చందు మృతదేహాన్ని కర్నూలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

జగన్ బెల్స్ లా.. వైసీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది.. మంత్రి పార్థసారథి సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Updated Date - May 01 , 2026 | 09:41 AM