Share News

రేపు కేఆర్‌ఎంబీ సమావేశం

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:48 AM

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 5న జరగనుంది. శ్రీశైలం జలాశయం దాదాపు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాక.. మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు కేటాయించేందుకు ఈ సమావేశం జరుగుతోంది.

రేపు కేఆర్‌ఎంబీ సమావేశం

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 5న జరగనుంది. శ్రీశైలం జలాశయం దాదాపు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాక.. మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు కేటాయించేందుకు ఈ సమావేశం జరుగుతోంది. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున రాష్ట్ర విభజన చట్టం, ట్రైబ్యునళ్లు కేటాయించాయి. అయితే ఇందుకు భిన్నంగా ‘నేచురల్‌ జస్టిస్‌’ పేరుతో చెరి సగం వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. దీనిపై తెలంగాణకు కేఆర్‌ఎంబీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంపై ఏపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. తెలంగాణ నీటి వాడకాన్ని కేఆర్‌ఎంబీ అడ్డుకోకపోవడంపైనా ఈ భేటీలో ప్రశ్నించాలని భావిస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 05:48 AM