Share News

బ్లాక్ మంట!

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:57 AM

జిల్లాలోని వినియోగదారులకు ఐవోసీఎల్, బీపీసీఎల్ హెచ్‌పీసీఎల్ కంపెనీలకు చెందిన 56 ఏజెన్సీల నుంచి వంట గ్యాస్ సరఫరా అవుతోంది. కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేసిన తర్వాత డొమెస్టిక్ సిలిండర్‌కు కొరత లేకుండా పోయింది.

బ్లాక్ మంట!

  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు

  • క్యూ కడుతున్న వినియోగదారులు

  • రూ. 935 డొమెస్టిక్ సిలిండర్‌కు రూ.1,100 వసూలు

  • బ్లాక్‌లో అయితే రూ.2 వేలు చెల్లించాల్సిందే..

  • పేద, మధ్యతరగతి కుటుంబాల నిలువు దోపిడీ

  • ప్రత్యేక అధికారి పర్యవేక్షణ లేనట్టే..

  • ఓటీపీ అడిగి మోసంచేశారు

  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు

  • ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న వినియోగదారులు

  • రూ.935 డొమెస్టిక్ సిలిండర్కు రూ.1100 వసూలు

  • బ్లాక్ లో అయితే రూ.2 వేలు చెల్లించాల్సిందే..

  • నిలువు దోపిడీకి గురవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు

  • ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణ.. కాగితాలకే పరిమితం

వినియోగదారుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను దోచుకుంటున్నారు. పది రోజుల క్రితం బుక్ చేసుకున్న వారికి సైతం సిలిం దర్ సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్కు తరలించేస్తున్నారు. సామాన్య జనాన్ని గంటల తరబడి క్యూలైన్లో నిలబెట్టి, అర్హులకు ఇవ్వాల్సిన సిలిండర్ను రూ.2 వేలకు అమ్ముకుంటున్నారు.


ఆంధ్రజ్యోతి, మార్చి 15: జిల్లాలోని వినియోగదారులకు ఐవోసీఎల్, బీపీసీఎల్ హెచ్‌పీసీఎల్ కంపెనీలకు చెందిన 56 ఏజెన్సీల నుంచి వంట గ్యాస్ సరఫరా అవుతోంది. కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేసిన తర్వాత డొమెస్టిక్ సిలిండర్‌కు కొరత లేకుండా పోయింది. సాధారణ రోజుల్లో రోజుకు సగటున 14,979 ఎల్‌పీజీ సరఫరా ఉంటుంది. యుద్ధం నేపథ్యంలో సృష్టించి గందరగోళ వాతా వరణంలో బుకింగ్స్ కాస్త ఎక్కువయాయి. గడిచిన నాలుగు రోజుల్లో 94, 417 బుక్సింగ్స్ జరిగాయి.

రోజుకు సగటు 24 వేల బుకింగ్స్ వస్తుండగా, ఆ సంఖ్యకు కాస్త అటుఇటుగా ఏజెన్సీలకు కంపెనీలు సిలిండర్స్ సరఫరా చేస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన 18,627 సిలిండర్ల సరఫరా, శనివారం 23,715 సిలిండర్లు సరఫరా జరిగింది. వినియోగ డిమాండ్‌‌కు అనుగుణంగానే ప్రభుత్వం చొరవతో కంపెనీల నుంచి ఏజెన్సీలకు సిలిండర్లు వస్తున్నాయి.


కృత్రిమ కొరత సృష్టించి..

యుద్ధం, కంటైనర్ నిలిపివేత, అంతర్జాతీయ రవాణా ఇబ్బందులు అనే వార్తలు వెలువడగానే గ్యాస్ కృత్రిమ కొరత కుట్ర ప్రారంభమైంది. దీనిలో భాగంగానే గత ఐదు రోజులుగా ఏజెన్సీలు డోర్ డెలివరిని నిలిపివేసి ప్రజలను భయాందోళకు గురి చేశాయి. అవసరమైన ప్రజలను ఏజెన్సీల వద్దకు రప్పించుకున్నాయి. వారిని ఎండలో నిలబెట్టాయి. ఒక్కొక్కరుగా ఏజెన్సీది చేరుకోవడంతో భారీ క్యూ ఏర్పాడాయి. ఎండలో నాలుగైదు గంటలు ప్రజలను నిలబెట్టి, సిలిండర్ దొరకటం కష్టమే..! గ్యాస్ కొరత వాస్తవమే..! అనే సంకేతాన్ని సమాజంలోకి పంపాయి. ప్రజలను భయాందోళనకు గురి చేసి దర్జాగా దోపిడి సాగిస్తున్నాయి.


సామాన్యుడికి చుక్కలే..

ఎజెనీల ధన దాహానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. శనివారం సిలిండర్ ధర రూ.905 ఉండగా, క్యూలైన్‌లో ఉన్న వారి నుంచి నిర్ణయగా రూ.1100 వసూలు చేస్తున్నారు. అయితే ఒక్కో ఏజెన్సీ ఒక్కో డెలివరీ ఆటోను మాత్రమే రూట్‌లో తిప్పుతుంది. అత్యవసరం అని ఏజెన్సీకి ఫోన్ చేసిన అక్కడకొచ్చి కోరిన వారి నుంచి రూ.2 వేలు తీసుకుని సదరు వినియోగదారుడి వివరాలను రూట్‌లో ఉన్న ఆటో డ్రైవర్‌కు చేరవేస్తున్నారు.

10 రోజుల క్రితం బుక్ చేసుకున్న వారి సిండర్లను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని కోసం అధికారులకు దొరక్కుండా ఓటీపీ మోసానికి పాల్పడుతున్నారు. బుక్ చేసుకున్న వారికి ఏజెన్సీ ఉద్యోగ/ డెలివరీ బాయ్ ఫోన్ చేసి మీ ఇంటికి సిలిండర్ తీసుకొస్తున్నానని, ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. వీరి అక్రమ దందా గుట్టు తెలియని ప్రజలు ఓటీపీ చెప్పేస్తునారు. ఆ సిలిండర్ బ్లాక్ మార్కెట్ ఏజెన్సీలు తరలిస్తున్నాయి.


ఎంతకీ గ్యాస్ ఇంటికి రాకపోవడంతో ఓటీపీ చెప్పిన వినియోగదారులు ఏజెన్సీ వద్దకు వచ్చి లబోదిబోమంటున్నారు. ఓటీపీ అడిగిన ఏజెన్సీ నిర్వాహకులే, మిమ్మల్ని ఓటీపీ ఎవడు చెప్పమన్నాడంటూ వినియోగదారులపై ఎదురుదాడికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గ్యాన్ బ్లాక్ మార్కెట్ పోకుండా అరికట్టేందుకు ఒక్కో ఏజెన్సీ ఒక్కో ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఈ నెల 13న ఉత్తర్వులు ఇచ్చారు. ఏజెన్సీలు సాగిస్తున్న దందాను పసిగట్టిన ప్రజలు నుంచి ఫోన్లు వస్తున్నప్పటికీ.. సంబంధిత అధికారులు అటు వైపు కన్నెతైనా చూడకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి.


ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం

గ్యాప్ ఏజెన్సీలు పాల్పడుతున్న ఆవినీతి తెలుసుకునేందుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని ఏజెన్సీల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రతి ఏజెన్సీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు పరిశీలన చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం

పి. వాణి, ఇన్‌చార్జి డీఎస్‌వో.


అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు

గ్యాస్ బుక్ చేశా. ఇంటికి డెలివరీ రాలేదు. ఏజెన్సీ వద్దకు వచ్చా ఇక్కడ భారీ క్యూలైన్ ఉంది. ఆఫీస్ లోపల బిల్ చేయించుకుని, సిలిండర్‌తో క్యూలైన్‌లో నిలబడ్డా. బిల్లులో రూ.935 ఉంది. కానీ సిలిండర్ ఇచ్చే వ్యక్తి రూ.1,100 బడిగాడు. అంతెందుకు అని ప్రశ్నిస్తే నాపై ఏజెన్సీ నిర్వాహకులు విరుచుకుపడ్డారు. దీంతో తహసీల్దార్‌కు ఫోన్ చేసి విషయం చెప్పా. వస్తాను అంటున్నారే కానీ రాలేదు.

-ఖాదర్ బాషా, చిట్టినగర్


ఓటీపీ అడిగి మోసం చేశారు

పది రోజుల క్రితం గ్యాస్ బుక్ చేశా. మాకు ఎప్పుడు డెలివరీ ఇచ్చే వ్యక్తి ఈ నెల 12న ఫోన్ చేసి సిలిండర్ తీసుకొస్తున్నాను. ముందుగా ఓటీపీ చెప్పాలని అడిగాడు. నమ్మకస్తుడే కదా అని ఓటీపీ చెప్పా, కానీ సిలిండర్ తీసుకురాలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని కుమ్మరిపాలెంలోని ఏజెన్సీ వద్దకు వచ్చా. బుక్ చేసుకున్నాం కదా.. అని లైన్లో నిలబడ్డా. నాలుగు గంటలు ఎండలో నిలబడిన తర్వాత నాకు సిలిండర్ ఇవ్వడం కుదరదని, రెండు రోజుల క్రితమే డెలివరీ జరిగిందని చెప్పారు. ఆఫీసులో అడిగితే 'నిన్ను ఓటీపీ ఎవడు చెప్పమన్నాడు' అని ఎదురుదాడి చేశారు. వాళ్లే మోసం చేసి, తిరిగి నన్ను తిడుతున్నారు.

-ఇంతియాజ్, వించిపేట


బుక్ చేసి 15 రోజులైనా ఇవ్వలేదు

15 రోజుల క్రితం సిలిండర్ బుక్ చేశా. ఇంటికి డెలివరీ రాలేదు. ఫోన్ చేస్తుంటే.. ఇంటికే పంపిస్తామంటూ నెట్టుకొస్తున్నారు. వీళ్లు పంపరని అర్థమై ఏజెన్సీ వద్దకు వచ్చా. సిలిండర్ కావాలంటే మళ్లీ బుక్ చేసుకోమని చెబుతున్నారు. 15 రోజుల క్రితం బుక్ చేసిన సిలిండర్ ఏమైందని అడిగా. 'సిలిండర్ కావాంటే చెప్పింది చెయ్యండి" అంటున్నారు.

-శ్రావణి, చిట్టినగర్

Updated Date - Mar 15 , 2026 | 08:09 AM