‘ఉపాధి’ని నిర్వీర్యం చేసిన జగన్
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:25 AM
‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అవినీతికి అడ్డా మార్చుకున్నారు. నేడు అదే పథకం గురించి, ఉపాధి కూలీల గురించి జగన్ పత్రికలో కపట ప్రేమ చూపిస్తూ...
నేడు కపట ప్రేమ చూపిస్తున్నాడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అవినీతికి అడ్డా మార్చుకున్నారు. నేడు అదే పథకం గురించి, ఉపాధి కూలీల గురించి జగన్ పత్రికలో కపట ప్రేమ చూపిస్తూ వార్తలు రాయడం విడ్డూరంగా ఉంది’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘2020-21లో రాష్ట్రంలో 94.89 లక్షలుగా ఉన్న జాబ్ కార్డులను సాంకేతిక సమస్యలు, ఆధార్ అనుసంధానం వంటి కారణాలతో 2023-24కి 67.71 లక్షలకు తగ్గించారు. 20.05 లక్షల కుటుంబాలను ‘ఉపాధి’కి దూరం చేశారు. జాతీయ స్థాయిలో జాబ్ కార్డుల తొలగింపు 11శాతం ఉండగా, రాష్ట్రంలో ఏకంగా 24.6 శాతం తొలగించారు’ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి