Share News

పెట్టుబడులతో మా రాష్ట్రానికి రండి: కొండపల్లి

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:07 AM

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

పెట్టుబడులతో మా రాష్ట్రానికి రండి: కొండపల్లి

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో బీఎఫ్ఎస్ఐ, ఫిన్‌టెక్‌, ఫార్మా, పెట్రో కెమికల్స్‌, జౌళి రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు బుధవారం ముంబైలో నిర్వహించిన ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ రోడ్‌షోలో మంత్రి మాట్లాడారు. ఈ రోడ్‌షోకు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య ప్రతినిధులు, వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:07 AM