Share News

కొనకళ్లకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

ABN , Publish Date - Nov 20 , 2026 | 09:27 PM

కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సీఎం.. వెంటనే కొనకళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు.

కొనకళ్లకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..
Chandrababu Naidu

అమరావతి, నవంబరు 20: కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సీఎం.. వెంటనే కొనకళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొనకళ్ల నారాయణరావు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.


అనంతరం చికిత్స అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణుల సేవలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 09:29 PM