Share News

ఆ మండలంలో ఒక్క గ్రామమే!

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:09 AM

మండలంలో ఉన్న 10 గ్రామాల్లో 9 రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీనమవడంతో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం చిన్నదైపోయింది.

ఆ మండలంలో ఒక్క గ్రామమే!

రాజమహేంద్రవరం రూరల్‌, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో ఉన్న 10 గ్రామాల్లో 9 రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీనమవడంతో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం చిన్నదైపోయింది. ఈ మండలంలో కోలమూరు గ్రామం ఒక్కటే మిగిలింది. పరిషత్‌ పోరులో ఇక్కడ 4 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 3 టీడీపీ, ఒకటి వైసీపీ గెలుచుకున్నాయి. ఈ నలుగురిలోనే ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్‌ ఎంపీపీగా ఉంటారు. జడ్పీటీసీ తాడేపల్లి నాగరాజు కూడా ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:09 AM