టీడీపీ కంచుకోట క్రిష్ణగిరిలో ‘సైకిల్’ లేదు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:17 AM
కర్నూలు జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టీడీపీకి కంచుకోట. ఈ మండలం పత్తికొండ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..
తొలిసారి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయనున్న కేఈ కుటుంబం
కర్నూలు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని క్రిష్ణగిరి మండలం టీడీపీకి కంచుకోట. ఈ మండలం పత్తికొండ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ సహా వారి కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఆ మండల పరిధిలోని కంబాలపా డులో ఉన్నాయి. కేఈ ప్రభాకర్ కుమారుడు కేఈ రుద్రఫణి కర్నూలు జడ్పీ చైర్మన్ రేసులో నిలిచారు. తన ఓటును కంబాలపాడుకు మార్చుకున్నారు. క్రిష్ణగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషనూ వేశారు. అయితే 2026 జనవరి 1 నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకే ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది.
దీంతో ఆయన ఓటు జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఆమోదించిన ఓటర్ల జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో అన్ని దశల్లోనూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయింది. హైకోర్టులోనూ వారికి చుక్కెదురయింది. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ నేత కఠారుకొండ మర్రి శ్రీరాములు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. మర్రి శ్రీరాములుకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రకటించారు. ఇనేళ్లూ ఏ ఎన్నిక జరిగినా సైకిల్‌కు తప్ప మరో గుర్తుకు ఓటు వేయడం తెలియని కేఈ కుటుంబం తొలిసారి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట