లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:50 AM
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గురువారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు.
నేడు మూలా నక్షత్రం.. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలోకి భక్తులు
విజయవాడ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గురువారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. గురువారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. సాయంత్రం 5.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 84,656 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి 44 నిమిషాల సమయం పట్టింది. కాగా, అమ్మవారు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల, శుక్రవారం ఒకేరోజు రావడంతో భక్తులు భారీగా తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు.
అందుకు అనుగుణంగానే గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలోకి భారీగా చేరుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయం, పూల మార్కెట్ వద్ద ప్రత్యేక కంపార్టుమెంట్లు ఏర్పాటుచేసి దర్శనానికి పంపుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు