Share News

గాజుల అలంకారంలో కనకదుర్గమ్మ

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:25 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బుధవారం గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా కార్తీక శుద్ధ విదియ

గాజుల అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బుధవారం గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా కార్తీక శుద్ధ విదియ (యమ ద్వితీయ) రోజున అమ్మవారికి గాజుల అలంకారం చేస్తారు. భక్తులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది సమర్పించిన 8 లక్షల గాజులతో ఈ అలంకారం చేశారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయ పరిసరాలను గాజుల దండలతో ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:25 AM