Share News

నిప్పుల కొలిమిలా కంభం

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:45 AM

ఎండలకు మార్కాపురం జిల్లా కంభం నిప్పులకొలిమిలా మారింది. ఎల్‌నినో ప్రభావంతో గత నాలుగు రోజులుగా కంభంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది

నిప్పుల కొలిమిలా కంభం

  • 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కంభం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎండలకు మార్కాపురం జిల్లా కంభం నిప్పులకొలిమిలా మారింది. ఎల్‌నినో ప్రభావంతో గత నాలుగు రోజులుగా కంభంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గత వారం మార్కాపురం జిల్లాలో కంభం మండలం మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడి ఆ ప్రాంతాలు కొంత చల్లబడ్డాయి. అయితే కంభంలో మాత్రం వానలు లేక, ఎండల తీవ్రత పెరగడంతో వేసవి వాతావరణం నెలకొంది.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:45 AM