ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 28 , 2026 | 09:40 PM
కాకినాడ జిల్లా, గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్‌లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ‘ఈ రోజు నేను డ్యూటీకి రావడం లేదు. ఉరివేసుకుని చనిపోతున్నాను’ అని కొలీగ్ నరేంద్ర కుమార్‌కు ప్రస్కిల్లా ఫోన్ చేసి చెప్పింది.
పిఠాపురంలో ఉన్న మరో కొలీగ్ చినబాబును గొల్లప్రోలులోని యువతి ఇంటి వెళ్లమని నరేంద్ర కుమార్ అప్రమత్తం చేశాడు. చినబాబు పోలీసులకు సమాచారం అందించి, ఇంటికి వెళ్లి చూడగా యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు స్థానికుల సహాయంతో యువతిని కిందకు దింపి సీపీఆర్ చేసి పిఠాపురం జీజీహెచ్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలి తండ్రి ఒరిస్సాకు చెందిన పీతాంబర్ రైల్వే ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారి కుటుంబం గొల్లప్రోలులోనే స్థిరపడింది. తల్లిదండ్రులు ఒరిస్సాలో పంక్షన్‌కు వెళ్లడంతో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రస్కిల్లా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ విఫలం కావడంతో ప్రియుడికి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పింది. తర్వాత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొలీగ్ చినబాబు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్?
బాలీవుడ్ సీనియర్ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు కన్నుమూత..