Share News

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అలక

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:57 AM

టీడీపీ సీనియర్‌ నాయకురాలు, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, తాజా జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి అలకబూనారు

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అలక

  • కాకినాడ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి తీసుకునేందుకు నిరాకరణ

కాకినాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకురాలు, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే, తాజా జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి అలకబూనారు. తనకు కాకినాడ జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వనందుకు నిరసనగా.. జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా నిరాకరించారు. జడ్పీటీసీల ప్రమాణ స్వీకార సమావేశంలో కాసేపు ముభావంగా కూర్చున్నారు. కొద్దిసేపటికే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.

వాస్తవానికి ఈ జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. బీసీలకు ఇచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆమె కాకినాడ రూరల్‌ జడ్పీటీసీగా బరిలోకి దిగి గెలిచారు. జడ్పీ పీఠం తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ పదవి జనసేనకు వెళ్లింది. దీంతో టీడీపీ నాయకత్వం ఆమెకు వైస్‌ చైర్మన్‌ పదవి కేటాయించింది. దీనిపై ఆమె అలుకబూనారు. శుక్రవారం జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి సైతం రానని భీష్మించారు.

విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ సానా సతీశ్‌, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ ఆమె ఇంటికి వెళ్లారు. బుజ్జగింపుల అనంతరం ఆమె మెట్టుదిగారు. వారితో కలిసి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కానీ జడ్పీటీసీగా ప్రమాణం చేయకుండానే వెళ్లిపోయారు. టీడీపీ నాయకత్వం మొదటి నుంచీ ఆమె కుటుంబానికి తగిన ప్రాధాన్యమిస్తూనే ఉంది. ఆమెకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, టీటీడీ పాలక వర్గ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. తాజా జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీకి దించింది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించిందని టీడీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 03:02 AM