Share News

ధరణి కృష్ణ మోసంపై పూర్తి విచారణ జరిపించాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:38 AM

జనసేన నాయకురాలు, కైరెన్‌ కన్సల్టెన్సీ కంపెనీ సీఈవో కోటా రుక్మిణి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన బోడపాటి ధరణి కృష్ణ వ్యవహారంపై

ధరణి కృష్ణ మోసంపై పూర్తి విచారణ జరిపించాలి

  • కైరెన్‌ కన్సల్టెన్సీ న్యాయ సలహాదారు లక్ష్మీ సాయి శిరీష

విజయవాడ అర్బన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జనసేన నాయకురాలు, కైరెన్‌ కన్సల్టెన్సీ కంపెనీ సీఈవో కోటా రుక్మిణి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన బోడపాటి ధరణి కృష్ణ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆ కంపెనీ న్యాయ సలహదారు కె.లక్ష్మీ సాయి శిరీష ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కోటా రుక్మిణిపై ఆరోపణలను ఖండించారు. ఈ ఏడాది జూన్‌లో ధరణి కృష్ణ కైరెన్‌ కన్సల్టెన్సీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా చేరారని, కంపెనీ పేరును ఉపయోగించి ప్రభుత్వ స్టాంపులతో నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు తయారుచేయించారని ఆరోపించారు.

ఈ వ్యవహరం ఈనెల 5న కోటా రుక్మిణి దృష్టికి రావడంతో విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. పెద్దిరాజు తనను బెదిరించటంతో ఈ వ్యవహరానికి పాల్పడినట్లు ఆమె చెప్పిందన్నారు. ఈనెల 11న ధరణి కృష్ణను ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేసి, ఆధారాలన్నీ అందజేశామని తెలిపారు. కోటా రుక్మిణిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ మోసం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 04:42 AM