Share News

కుమార్తె వెంట పడుతున్నాడని దాడి

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:39 AM

తమ కుమార్తె వెంటపడుతున్నాడంటూ ఓ బాలుడిపై బాలిక తండ్రి, మరో ఇద్దరు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్ర గాయాలతో మృతిచెందాడు.

కుమార్తె వెంట పడుతున్నాడని దాడి

  • తీవ్ర గాయాలతో బాలుడి మృతి.. తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

కడియం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తమ కుమార్తె వెంటపడుతున్నాడంటూ ఓ బాలుడిపై బాలిక తండ్రి, మరో ఇద్దరు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్ర గాయాలతో మృతిచెందాడు. పోలీసులు, బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరితోటకు చెందిన వాసంశెట్టి ఏడుకొండలు పంచాయతీ సాగునీటి పథకం వద్ద ట్యాంక్‌ ఆపరేటర్‌గా చేస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురికావడంతో అతని కుమారుడు కార్తీక్‌ (16) విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఇందులో భాగంగా కార్తీక్‌ బుధవారం వాటర్‌ ట్యాంక్‌ వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వచ్చి.. తమ కుమార్తెను ఏడిపిస్తున్నాడంటూ కార్తీక్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ను తొలుత కడియం సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కార్తీక్‌ తల్లి ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్‌ను పొట్టనపెట్టుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బాలుడి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కడియం, ధవళేశ్వరం సీఐలు అక్కడకు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. కాగా, దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:41 AM