Share News

కదిరిలో ఉద్రిక్తత: రౌడీషీటర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం!

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:42 PM

కదిరిలో ఓ రౌడీ షీటర్ ఇంటి వద్ద తీవ్ర హైడ్రామా నెలకొంది. అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్‌తో వచ్చిన పోలీసులను అడ్డుకున్న శివ కుటుంబం.. ఏకంగా ద్రావకం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ముగ్గురి పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

కదిరిలో ఉద్రిక్తత: రౌడీషీటర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం!
Kadiri Police

శ్రీ సత్యసాయి జిల్లా, : కదిరిలో శివ అనే రౌడీషీటర్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రౌడీషీటర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు తీవ్ర నిరసన ఎదురైంది. శివపై అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే శివను అదుపులోకి తీసుకునేందుకు కదిరి పోలీసులు ఇంటికి చేరుకున్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన రౌడీ షీటర్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వారిపై తిరగబడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు రెండు గంటల పాటు శివ ఇంటి వద్ద తీవ్ర హైడ్రామా నడిచింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రౌడీషీటర్ శివతో పాటు అతని భార్య, తల్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.


విధులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ హెచ్చరిక

క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముగ్గురినీ పోలీసులు వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం అక్కడ నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రౌడీషీటర్ శివ తండ్రి చంద్రశేఖర్ పోలీసులను తీవ్ర పరుష పదజాలంతో దూషించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పోలీసుల విధులకు తీవ్ర ఆటంకం కలిగించడమే కాకుండా ఉద్రిక్తతలకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి...

వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 01:51 PM