Share News

పంచాయతీ ఎన్నికల బహిష్కరణ!

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:59 AM

తమ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఇలాగే ఎన్నికలను పట్టించుకోలేదు.

పంచాయతీ ఎన్నికల బహిష్కరణ!

  • ఐదేళ్ల క్రితమూ ఇలాగే ఎన్నికలకు దూరంగా

  • విలీనానికి వ్యతిరేకంగా కడప జిల్లా కె.సుగమంచిపల్లెలో

  • జనం నిరసన గళం.. పట్టించుకోని అధికారగణం

కొండాపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తమ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఇలాగే ఎన్నికలను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే బాట పట్టారు. ఇది కడప జిల్లాలోని కొండాపురం మండలంలోని కె.సుగమంచిపల్లెలోని ప్రజల నిరసన. కొండాపురం మండలంలో 28 పంచాయతీలు ఉండేవి. గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురికావడంతో దత్తాపురం, బుక్కపట్నం, కె.బొమ్మేపల్లె పంచాయతీలను కె.సుగమంచి పల్లె పంచాయతీలో, చౌటిపల్లె పంచాయతీని ఓబన్నపేటలో విలీనం చేశారు.

అయితే దత్తాపురం, బుక్కపట్నం, కె.బొమ్మేపల్లె పంచాయతీల ప్రజలు మొదటి నుంచి తమను కె.సుగుమంచిపల్లెలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా కలిపారని ఆరోపిస్తున్నారు. 2021లో కూడా వీరు ఎన్నికలను బహిష్కరించారు. ఈ దఫా కూడా ఒక్క నామినేషన్‌ వేయకుండా ఎంపీటీసీ, సర్పంచ్‌, 14 వార్డుల ఎన్నికలు బహిష్కరించారు. గతంలో మాదిరే తమ పంచాయతీలను ఉంచేవరకు, తాము ఎన్నికలు బహిష్కరిస్తూనే ఉంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 06:01 AM