Share News

అక్రమంగా గల్ఫ్‌ దేశాలకు మహిళల తరలింపు

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:37 AM

ఉపాధి అవకాశాల పేరుతో పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌ దేశాలకు తరలిస్తున్న కడపలోని భారత్‌ ట్రావెల్స్‌ యజమాని ఇఫ్తియార్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమంగా గల్ఫ్‌ దేశాలకు మహిళల తరలింపు

  • కడపలో భారత్‌ ట్రావె ల్స్‌ యజమాని ఇఫ్తియార్‌ అరెస్టు

  • ఇమిగ్రేషన్‌ అధికారుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు

కడపక్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉపాధి అవకాశాల పేరుతో పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌ దేశాలకు తరలిస్తున్న కడపలోని భారత్‌ ట్రావెల్స్‌ యజమాని ఇఫ్తియార్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనుమతులు లేకుండానే మహిళలను ఇఫ్తియార్‌ మస్కట్‌, దుబాయ్‌, కువైత్‌ తదితర దేశాలకు పంపిస్తున్నట్లు హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గుర్తించారు. దీనిపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం కడప వన్‌టౌన్‌ పోలీసుల సహకారంతో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఇఫ్తియార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంట నే అతడిని హైదరాబాద్‌కు తరలించారు. ఎంతమంది మహిళలను ఏఏ దేశాలకు పంపించాడు, ఈ అక్రమ తరలింపు వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:38 AM