ఏపీ స్టెప్ ఎండీగా నీలకంఠారెడ్డి
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:04 AM
ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ ఎండీగా కె.నీలకంఠారెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ సొసైటీ ఫర్ ట్రైనింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ ఎండీగా కె.నీలకంఠారెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ స్టెప్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శాప్ ఎండీ ఎస్.భరణని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
ఈ వార్తలనూ చదవండి..