Share News

పెండింగ్‌ కేసులు సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:25 AM

కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని, సత్వరం కేసులు పరిష్కరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సూచించారు.

పెండింగ్‌ కేసులు సత్వరం పరిష్కరించాలి

  • హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి

  • చింతలపూడిలో అదనపు సివిల్‌ కోర్టు ప్రారంభం

చింతలపూడి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని, సత్వరం కేసులు పరిష్కరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రాంగణంలో కొత్తగా మంజూరైన అదనపు సివిల్‌ జడ్జి కోర్టు కం అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానిక ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతలపూడిలో సబ్‌ కోర్టు మంజూరు కావాలంటే 500 కేసులు అప్పీళ్లకు వెళ్లాలని అప్పుడే సబ్‌ కోర్టు మంజూరు చేయగలమన్నారు.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి మాట్లాడుతూ న్యాయవాదులు కేసుల పరిష్కారంలో చొరవ చూపితే కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి, చింతలపూడి జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.బి.అప్పారావు మాట్లాడారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూరయ్య అధ్యక్షత వహించగా జిల్లాలోని వివిధ కోర్టుల నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:25 AM