జోగి రమేశ్ కుటుంబంతో ప్రాణహాని
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:31 AM
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన కోడలు జోగి మేఘన భయాందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ..
మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన మేఘన
మంగళగిరి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన కోడలు జోగి మేఘన భయాందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ.. మేఘన, ఆమె తండ్రి కృష్ణ, వారి కుటుంబసభ్యులు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ... జోగి మనుషులు తమను ఫాలో అవుతున్నారని, కేసు విషయంలో దర్యాప్తు కూడా సరిగా జరగడం లేదని వాపోయారు. మేఘన తరఫున లాయర్‌తో మాట్లాడిన మహిళా కమిషన్.. కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంది. మేఘన కుటుంబానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, అవసరమైతే తెలంగాణ మహిళా కమిషన్‌తో మాట్లాడి పోలీసు రక్షణ ఏర్పాటు చేస్తామని శైలజ హామీ ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’