ఉప్పొంగుతున్న జలాశయాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:24 AM
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
జోలాపుట్టు, డుడుమ నుంచి నీరు విడుదల
నీటమునిగిన సరిహద్దు వంతెన
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా), అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. జోలాపుట్టు జలాశయం నుంచి 24 వేల క్యూసెక్కులు, డుడుమ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు. జోలాపుట్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న ఇరురాష్ట్రాల సరిహద్దు వంతెన మునిగిపోయింది. జోలాపుట్టు జలాశయం గరిష్ఠం 2,750 అడుగులు కాగా, గురువారం 2,749 అడుగులకు చేరింది. ఉదయం ఇక్కడి స్పిల్‌వే డ్యామ్ నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
దీంతో జోలాపుట్టు సరిహద్దు వంతెన మునిగిపోయింది. ఈ క్రమంలో 6వేల క్యూసెక్కులు తగ్గించి 24 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వంతెన అడుగు భాగాన్ని తాకుతూ నీరు ప్రవహి స్తోంది. దీంతో అటుగా రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. ఇక, డుడుమ జలాశయం సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,588.5 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి బలిమెలకు 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు