ఒక్క ఓటుతో విజయం
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:35 AM
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. చివరి వరకు నువ్వా... నేనా అన్నట్టు సాగిన పోటీలో ...
నరసాపురం రూరల్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. చివరి వరకు నువ్వా... నేనా అన్నట్టు సాగిన పోటీలో జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మల్లాడి వెంకట రాజ్యలక్ష్మి ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఆమెకు ప్రధాన పోటీదారుగా టీడీపీ మద్దతుదారు మల్లాడి జ్యోతి బరిలో ఉన్నారు. మొదట జనసేన అభ్యర్థి ఐదు ఓట్లతో గెలుపొందారు. టీడీపీ రీకౌంటింగ్‌కు పట్టుబట్టింది. ఈసారి జనసేన మద్దతుదారు ఒక్క ఓటుతో గెలిచారు. మరోసారి రీకౌంటింగ్ జరపడంతో రాజ్యలక్ష్మికి 304, జ్యోతికి 303 ఓట్లు వచ్చాయి. దీంతో రాజ్యలక్ష్మికి ఒక్క ఓటు మెజార్టీ వచ్చింది. మరోసారి రీకౌంటింగ్‌కు టీడీపీ మద్దతుదారులు పట్టుబట్టడంతో రిటర్నింగ్ అధికారి అంగీకరించలేదు. ఒక్క ఓటుతో రాజ్యలక్ష్మి గెలుపొందినట్లు ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా