Share News

కోట రుక్మిణిపై అసభ్య ప్రచారం సరికాదు: జనసేన

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:36 AM

తమ పార్టీ నాయకురాలు కోట రుక్మిణిపై జరుగుతున్న అసభ్యకర ప్రచారం, వ్యక్తిత్వ హననం సరికాదని జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకులు పేర్కొన్నారు.

కోట రుక్మిణిపై అసభ్య ప్రచారం సరికాదు: జనసేన

విజయవాడ(లబ్బీపేట), నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నాయకురాలు కోట రుక్మిణిపై జరుగుతున్న అసభ్యకర ప్రచారం, వ్యక్తిత్వ హననం సరికాదని జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకులు పేర్కొన్నారు. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, హైకోర్టు న్యాయవాది శిరీష, కాకినాడ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బుర్రా దివ్యరాజ్‌ మాట్లాడుతూ... ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా కొన్ని మీడియా చానళ్లలో తమ పార్టీ నాయకురాలు కోట రుక్మిణిపై జరుగుతున్న అసభ్యకర ప్రచారం, వ్యక్తిత్వ హనన యత్నాలను ఖండిస్తూ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజను కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పారు.

నేరస్థులపై కాకుండా బాధితులపైనే మీడియా ట్రోల్స్‌ నడపడం సరికాదని, దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ‘ఈమధ్య కాలంలో రాష్ట్రంలోని ఫేక్‌ జాబ్‌ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టిన రుక్మిణి దానిపై మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై వైసీపీ అధికార ప్రతినిధి యనమల, సాక్షి న్యూస్‌ సంస్థ, కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తలు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోండి’ అని రాయపాటి శైలజను వారు కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 06:39 AM