Share News

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:37 PM

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Pawan Kalyan Jana Sena day

అమరావతి, మార్చి 13: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో పవన్ స్వయంగా పాల్గొననున్నారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో జనంతో కలిసి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరించనున్నారు.


అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీతో పాటు పలు పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలించనున్నారు.


నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తూ, మార్గం మధ్యలో గిరిజనులతో మమేకం అవనున్నారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించనున్నారు. నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే మాటా-మంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గిరిజనులతో కలసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

మా వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయ్: ఇరాన్ మిలిటరీ

గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా.. యూఎస్ రక్షణ మంత్రి

Updated Date - Mar 13 , 2026 | 09:48 PM