జనసేన అభ్యర్థుల బీఫారాలను చించేసిన దుండగులు
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:24 AM
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో జనసేన బీఫారాలను కొందరు చించేశారు. మండలంలోని 24 ఎంపీటీసీల్లో 11 జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ మంగళవారం బీఫారాలు ఇచ్చారు.
రైల్వేకోడూరులో పోటాపోటీగా బీఫారాలు
ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్, యనమల భాస్కరరావు
రైల్వేకోడూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో జనసేన బీఫారాలను కొందరు చించేశారు. మండలంలోని 24 ఎంపీటీసీల్లో 11 జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించారు. జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ మంగళవారం బీఫారాలు ఇచ్చారు. బీఫారాలు అందుకున్న కొమ్మా శివ, కొండేటి వెంకటరమణ... వాటిని అధికారికి అందజేసేందుకు బైక్‌పై వెళుతుండగా శాంతినగర్ సమీపంలో కొందరు అడ్డుకుని బీఫారాలు చించేశారు. కాగా జనసేన నాయకుడు యనమల భాస్కరరావు 12 మందికి బీఫారాలు ఇచ్చారు.
ఇది మండలంలో కలకలం రేపింది. ఇరుపక్షాలూ ఎన్నికల అధికారికి బీఫారాలు సమర్పించారు. దీంతో నాయకులు, అధికారులు ఇరకాటంలో పడ్డారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఇచ్చిన బీఫారాలు జనసేన అధిష్ఠానం ఇచ్చినవి. మరొకరు ఇచ్చిన బీ-ఫారాలు నకిలీవి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. డబుల్ బీ-ఫారాలను పరిశీలిస్తున్నామని, కలెక్టర్‌కు సమాచారం ఇచ్చామని ఎన్నికల అధికారి భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే శ్రీధర్ ఇచ్చిన బీ ఫారాలు అసలైనవిగా ఎన్నికల అధికారి తేల్చారు. దీంతో యనమల భాస్కరరావు బీఫారాలు ఇచ్చిన అభ్యర్థులంతా స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో మిగిలారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు