Share News

ఆ బాలికకు సాయం చేయకపోతే మేం వచ్చాక ఆదుకుంటాం

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:39 AM

రాప్తాడు బాలికకు ప్రభుత్వం 50 లక్షల రూపాయల సాయం అందించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాయమందించకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని అన్నారు.

ఆ బాలికకు సాయం చేయకపోతే మేం వచ్చాక ఆదుకుంటాం

  • బెంగళూరు ఆసుపత్రిలో బాలిక తల్లిదండ్రులకు జగన్‌ పరామర్శ

బెంగళూరు అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాప్తాడు బాలికకు ప్రభుత్వం 50 లక్షల రూపాయల సాయం అందించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాయమందించకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని అన్నారు. రాప్తాడు ఘటనలో గాయపడ్డ బాలిక చికిత్స పొందుతున్న బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి ఆయన వెళ్లారు. బాధిత విద్యార్థిని పరిశీలించి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. దేవుడి దయతో బాలిక కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారని చెప్పారు.

రాష్ట్రంలో గంజాయి, బెల్టు షాపులు విచ్చలవిడిగా ప్రతి ఊరిలోనూ నడుస్తున్నాయని ఆరోపించారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల బాలికలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం సాగుతోందని, రాప్తాడులో 15 నెలల వ్యవధిలో ఇది తొమ్మిదో సంఘటన అని అన్నారు. సోమవారం యలహంకలోని తన నివాసం నుంచి హెచ్‌ఏఎల్‌ రోడ్డులోని మణిపాల్‌ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆసుపత్రికి చేరుకునేసరికి కార్యకర్తలు, అభిమానులు అక్కడికి వచ్చారు. ప్రెస్‌మీట్‌ కూడా తోపులాట మధ్య సాగింది. మొబైల్‌లో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు కార్యకర్తలు ఎగబడటంతో ఆసుపత్రి ఎదుట గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 04:39 AM