Share News

సీమ లిఫ్టుపై అవే అబద్ధాలు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:56 AM

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాజీ సీఎం జగన్‌ మరోసారి అబద్ధాలు వల్లెవేశారు. ఆ ప్రాజెక్టుకు తాను ఎలాంటి అనుమతులూ తీసుకోకున్నా..

సీమ లిఫ్టుపై అవే అబద్ధాలు!

  • అనుమతులు తీసుకోని విషయం దాచిన జగన్‌

  • తానెందుకు పూర్తి చేయలేదో కూడా చెప్పలేదు

  • చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ జగన్‌ ట్వీట్‌

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాజీ సీఎం జగన్‌ మరోసారి అబద్ధాలు వల్లెవేశారు. ఆ ప్రాజెక్టుకు తాను ఎలాంటి అనుమతులూ తీసుకోకున్నా.. నికర జలాల కేటాయింపులు లేకపోయినా.. అన్నీ ఉన్నాయని బుకాయించారు. జగన్‌ గల్లా పట్టుకుని ఈ పథకాన్ని నాటి సీఎం కేసీఆర్‌ ఆపించారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా.. సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు.

‘హాట్‌లైన్‌లో కాంగ్రెస్‌తో దోస్తీ కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు వాస్తవాలను మరుగునపరచి మౌనంగా ఉన్నాడు’ అని గురువారం ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. ఈ పథకం కొత్తది కాదని.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు తరలిస్తున్న కృష్ణా జలాలనే వాడుకుంటున్నందున కొత్తగా అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదంటూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ పథకం దాదాపు పూర్తయిందని.. తనకు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు పనులు పూర్తి చేయడం లేదని అబద్ధం చెప్పారు. తన హయాంలో ఎత్తిపోతల డీపీఆర్‌ తయారీకంటూ తవ్వకాలు, నిర్మాణాలు చేపడితే.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) స్టే ఇచ్చిన సంగతి దాచిపెట్టారు


అసలీ పథకాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్‌జీటీలో 2020లో కేసు వేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ ట్రైబ్యునల్‌ ఆదేశాలిచ్చింది. ఈ స్టేను తొలగించే దిశగా జగన్‌ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం ఎన్‌జీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ న్యాయస్థానంలో వ్యాజ్యం వేయాలని నిర్ణయించింది. అయితే జగన్‌ తన ట్వీట్‌లో.. సీమ లిఫ్టుపై కేసీఆర్‌ సర్కారు ఎన్‌జీటీని ఆశ్రయించిన వాస్తవాన్ని ప్రస్తావించనే లేదు. పైగా ఈ పథకానికి అపెక్స్‌ కమిటీ ఆమోదం అక్కర్లేదన్నట్లుగా.. కొత్త పథకం కాదని.. నీటి కేటాయింపులూ ఉన్నాయని బుకాయించారు. తన హయాంలోనే. ఆరేళ్ల కిందట ఆగిపోయిన ఈ పథకం దాదాపు పూర్తయ్యిందంటూ ఇంకో అబద్ధం చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 02:01 AM