Share News

వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:51 AM

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బుధవారం వైసీపీ అధినేత జగన్‌ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల వికృత చేష్టలకు ఒక చిరు వ్యాపారి మృతి చెందాడు.

వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి
Jagan Devarapalli Tour

  • జగన్‌ దేవరపల్లి పర్యటన బీభత్స ఫలితం

  • వైసీపీ వీరంగంతో గాయపడ్డ చిరు వ్యాపారి మృతి

  • జగన్‌ దేవరపల్లి పర్యటన బీభత్స ఫలితం

చాగల్లు/దేవరపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బుధవారం వైసీపీ అధినేత జగన్‌ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల వికృత చేష్టలకు ఒక చిరు వ్యాపారి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అతిగా మద్యం సేవించి వేగంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ రోడ్డుపై వీరంగం సృష్టించారు.


అనిల్‌ అనే కార్యకర్త తన బైకుతో కూరగాయల వ్యాపారి గెడ్డం మునేశ్వరరావు (56)ను ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. చాగల్లు మండలం మల్లవరానికి చెందిన మునేశ్వరరావు.. సరుకు అమ్ముకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.


ఇవి కూడా చదవండి

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

తీరు మార్చుకోని అధికారి!

Updated Date - Aug 08 , 2026 | 06:53 AM