Share News

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:43 AM

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావును పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేసింది.

భారీగా ఐఏఎస్‌ల బదిలీ
AP IAS Transfers

  • పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు

  • పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎ్‌సగా ఎస్‌.ఎ్‌స.రావత్‌ బదిలీ

  • జీఏడీకి రిపోర్టు చేయాలని ఆమ్రపాలికి ఆదేశం

  • 22 మంది బదిలీ.. రెండ్రోజుల్లో మరో 15 మందికి!

అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావును పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేసింది. జీఏడీ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించింది. ఆయన ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలు సైతం నిర్వహిస్తారు. జీఏడీ (సర్వీసెస్‌) ప్రత్యేక సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ను బదిలీ చేసి.. పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జీఏడీలో సర్వీసెస్‌, జీపీఎం అండ్‌ ఏఆర్‌ బాధ్యతలను కూడా ఆయన అదనంగా నిర్వహిస్తారు.


ఏపీటీడీసీ ఎండీగా ఉన్న ఆమ్రపాలి కాటాను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నత విద్య కార్యదర్శిగా ఉన్న కోన శశిధర్‌ను బదిలీ చేసి.. కీలకమైన ఆర్‌ అండ్‌ బీ, మౌలిక వసతులు- పెట్టుబడుల శాఖల బాధ్యతలు అదనంగా ఐ అండ్‌ ఐ సెక్రటరీగానూ ఆయన వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎస్‌జీ అండ్‌ ఎస్‌డబ్యూ డైరెక్టర్‌గా ఉన్న ఎం.శివప్రసాద్‌ను ప్రభుత్వం ఆర్టీసీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. దీంతో పాటు ఎస్‌జీ అండ్‌ ఎస్‌డబ్యూ డైరెక్టర్‌గా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పటాన్‌శెట్టి రవిసుభా్‌షను బదిలీ చేసి.. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. ఏపీటీఏ సీఈవోగా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్‌.సురేశ్‌కుమార్‌ను అదనంగా గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారిగా నియమించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ భరత్‌ గుప్తాను కూడా పుష్కరాల జాయింట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించింది.


  • రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌గా ఉన్న ముత్యాలరాజు మ్యూజియం, ఆర్కియాలజీ శాఖ కమిషనర్‌గా బదిలీ.

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వద్ద ఓఎస్‌డీగా ఉన్న కె.వెంకటకృష్ణకు రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు.

  • డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌గా ఉన్న కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబుకు ఆరోగ్యశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎండీగా, ఆయుష్‌ డైరెక్టర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

  • కర్ణాటక నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన హెప్సిబా రాణి కొర్లపాటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమితులయ్యారు. అక్కడున్న పి.అరుణ్‌బాబు డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డీజీగా బదిలీ .

  • టౌన్‌షిప్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.సునీల్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వం అదనంగా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు.


విశాఖకు ప్రఖార్‌ జైన్‌..

ఆర్‌టీజీఎస్‌ సీఈవో ప్రఖార్‌ జైన్‌ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఆర్టీజీఎస్‌ సీఈవోగా గీతాంజలి శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీసీఎల్‌ఏలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్న చేతన్‌ టి.ఎస్.కు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.


కొత్త ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌...

నాన్‌-ఎస్‌సీఎస్‌ కోటాలో ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన వారిలో పి.గోపినాథ్‌ను టీటీడీ జేఈవోగా ప్రభుత్వం నియమించింది. టీటీడీ (హెల్త్‌, ఎడ్యుకేషన్‌) జేఈవోగా రిటైరైన ఎ.శరత్‌ను జేఈవోగా పునర్నియమించింది. ఎ.ఎ.ఎల్‌.పద్మావతి ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోగా నియమితులయ్యారు. ఎం.జయకృష్ణను తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించారు. తాజా బదిలీల్లో ముగ్గురిని జీఏడీకి పంపారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న ఆమ్రపాలి 2నెలలుగా సెలవులో ఉన్నారు. ఆమెను ప్రభుత్వం జీఏడీకి అటాచ్‌ చేసింది. ఇటీవలే వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులైన ఎన్‌.తేజ్‌ భరత్‌ను.. బదిలీచేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ బి.అనిల్‌కుమార్‌రెడ్డిని కూడా జీఏడీలో రిపోర్టు చేయాలని పేర్కొంది. 2-3 రోజుల్లో మరో 10-15 మంది ఐఏఎ్‌సలు బదిలీ అవుతారని జీఏడీ వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి

తీరు మార్చుకోని అధికారి!

మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్‌

Updated Date - Aug 08 , 2026 | 06:45 AM