Share News

మిషన్‌ నుంచి వైదొలిగితే అడ్వాన్స్‌ వెనక్కివ్వం: ఇస్రో

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:14 AM

ఉపగ్రహ ప్రయోగాల బుకిం గ్‌ కోసం వినియోగదారులు చెల్లించే ముందస్తు చెల్లింపుల (అడ్వాన్స్‌) మొత్తాన్ని ఇకపై వాపసు ఇవ్వకూడదని ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది.

మిషన్‌ నుంచి వైదొలిగితే అడ్వాన్స్‌ వెనక్కివ్వం: ఇస్రో

శ్రీహరికోట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉపగ్రహ ప్రయోగాల బుకిం గ్‌ కోసం వినియోగదారులు చెల్లించే ముందస్తు చెల్లింపుల (అడ్వాన్స్‌) మొత్తాన్ని ఇకపై వాపసు ఇవ్వకూడదని ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు విదేశీ కస్టమర్లు తమ ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఒప్పందం చేసుకుని... చివరి నిమిషంలో వివిధ కారణాలతో వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల ఇస్రో నష్టపోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇస్రో వాణిజ్య వ్యవహారాలను పర్యవేక్షించే ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్) చైర్మన్‌ పవన్‌కుమార్‌ గోయెంకా తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఇస్రో షార్‌ నుంచి ఎస్‌ఎ్‌సఎల్‌వీ-4 ప్రయోగం చేపట్టనుంది. దీనిద్వారా తమ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు పలువురు వినియోగదారులు ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్నారు.

ఇస్రో కూడా రాకెట్‌ ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఈ సమయంలో తమ ఉపగ్రహాలను పంపేందుకు సుముఖంగా లేమంటూ పలువురు వెనక్కి తగ్గారు. దాంతో 60 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను మాత్రమే పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇకపై నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ విధానాన్ని అమలు చేస్తామని గోయెంకా స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:20 AM