చార్జింగ్‌కు భలే డిమాండ్..!
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:19 AM
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఇన్వర్టర్ బ్యాటరీల చార్జింగ్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో గత 48 గంటల నుంచి అంధకారం అలముకుంది.
బ్యాటరీ ఫుల్ చార్జింగ్‌కు రూ.500 వసూలు
నరసాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఇన్వర్టర్ బ్యాటరీల చార్జింగ్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో గత 48 గంటల నుంచి అంధకారం అలముకుంది. చాలా ఇళ్లలో ఇన్వెర్టర్ల బ్యాటరీలు ఖాళీ అయ్యాయి. వాటికి చార్జింగ్ కోసం జనం షాపుల వద్దకు క్యూ కట్టారు. దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. భారీ జనరేటర్లు ఏర్పాటుచేసి బ్యాటరీలకు చార్జింగ్ పెడుతున్నారు. ఒక బ్యాటరీ ఫుల్‌గా చార్జింగ్ అవ్వడానికి 5-6గంటలు పడుతుంది. బ్యాటరీని బట్టి రూ.300 నుంచి 500 వరకూ వసూలు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు