Share News

మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:43 AM

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు, గంగవరం, పెనుమూరు, వి.కోట మండలాల్లో జడ్పీటీసీ విజేతలకు వచ్చిన మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికంగా..

మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం

చిత్తూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు, గంగవరం, పెనుమూరు, వి.కోట మండలాల్లో జడ్పీటీసీ విజేతలకు వచ్చిన మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉన్నాయి. గంగాధరనెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఎస్‌.ఏసుమణికి 304 ఓట్లు మెజార్టీ రాగా, చెల్లని ఓట్లు 749 ఉన్నాయి. గంగవరంలో టీడీపీ అభ్యర్థి ప్రతా్‌పరెడ్డికి 510 ఓట్లు మెజార్టీ ఉండగా, 707 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పెనుమూరులో వైసీపీ అభ్యర్థి నిరీశకు 184 ఓట్లు మెజార్టీ రాగా, చెల్లని ఓట్లు 405 ఉన్నాయి. వి.కోటలో విజేత అయిన టీడీపీ అభ్యర్థి కుమార్‌కు 618 ఓట్ల మెజారిటీ రాగా.. 1161 ఓట్లు చెల్లనివి ఉన్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:43 AM