పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు భేష్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:55 AM
పోలవరం ప్రధాన డ్యామ్ పనుల్లో అత్యంత ముఖ్యమైన డయాఫ్రమ్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను ఇచ్చింది.
అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రధాన డ్యామ్ పనుల్లో అత్యంత ముఖ్యమైన డయాఫ్రమ్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులు అంతర్జాతీయ, జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు జి.డి.కాకో, ఆర్.డొనెల్లీ, ఎస్.హించ్‌బర్గెర్, డి.పాల్‌తో కూడిన బృందం పోలవరం ప్రాంతంలో పర్యటించింది. తమ నివేదికను ఆ మరునాడే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) సమర్పించింది. డయాఫ్రమ్ వాల్‌లో ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు బాగున్నాయని ఆ నివేదికలో కితాబు ఇచ్చింది. నాణ్యతా ప్రమాణాల పరీక్షలన్నీ బాగున్నాయని పేర్కొంది. డయాఫ్రమ్‌వాల్ 67,148 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారని, గతంలో తాము పేర్కొన్న సాంకేతిక లోపాలన్నింటినీ సరిచేశారని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం