Share News

పోలవరం నిర్మాణ నాణ్యత భేష్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:07 AM

‘పోలవరం ప్రధాన డ్యామ్‌ పనుల నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయి. పనులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ కూడా బాగుంది’ అని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పేర్కొంది.

పోలవరం నిర్మాణ నాణ్యత భేష్‌

  • అంతర్జాతీయ నిపుణుల బృందం సంతృప్తి

  • పూర్తయిన నాలుగు రోజుల పర్యటన

అమరావతి, పోలవరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రధాన డ్యామ్‌ పనుల నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయి. పనులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ కూడా బాగుంది’ అని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పేర్కొంది. పోలవరం పనుల పర్యవేక్షణ కోసం అమెరికా, కెనడా దేశాలకు చెందిన సీన్‌ హించ్‌బర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ, డేవిడ్‌ పాల్‌, గియాన్‌ ఫ్రాన్కో డి సిక్కో నాలుగు రోజుల పర్యటనకు వచ్చారు. కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ పనులు, నాణ్యతా నియంత్రణ పరీక్షలను పరిశీలించారు. గ్యాప్‌ ఒకటి, రెండు నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పలు అంశాలపై సమీక్షించారు.

నిర్మాణ నాణ్యత పరీక్షల నిర్వహణ తీరుపై ఈ సందర్భంగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో క్షేత్ర స్థాయి లో నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించి, నిర్మాణాల్లో సాంకేతికత వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కార్యాలయంలో చివరి రోజు శనివారం జరిగిన సమీక్షలో.. పర్యటనలో తాము గుర్తించిన కీలక అంశాలను కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతోపాటు మేఘా నిర్మాణ సంస్థ ప్రతినిధులకు బృందం సభ్యులు వివరించారు.

సమన్వయంతో పర్యటన

నిపుణుల పర్యటనను పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి సమన్వయం తో విజయవంతంగా నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరోసారి పోలవరంలో పర్యటిస్తామని నిపుణుల బృందం సూచనప్రాయం గా తెలిపింది. పర్యటన ముగింపు సందర్భంగా.. మేఘా నిర్మాణ సంస్థ జీఎం ఏ. గంగాధర్‌తోపాటు అంతర్జాతీయ నిపుణులను పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా శాలువాలతో సత్కరించారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:07 AM