ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:32 AM
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 1.50 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం..
తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఆలస్యంగా పయనం
రేణిగుంట, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 1.50 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం 2.25 గంటలకు హైదరాబాదుకు బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక లోపం తలెత్తడంతో గంట ఆలస్యంగా 125 మంది ప్రయాణికులతో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరోసారి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సురక్షితంగా తిరుపతి విమానాశ్రయంలో దించారు. మరో విమానంలో ప్రయాణికులను హైదరాబాదుకు పంపించారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ