Share News

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:23 AM

చెన్నై నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. వివరాల్లోకి వెళితే..

రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
IndiGo Emergency Landing

రాజమండ్రి, సెప్టెంబర్ 12: వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై నుంచి గన్నవరం బయలుదేరిన ఇండిగో విమానాన్ని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు. ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని రాజమండ్రిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు సమాచారం. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గన్నవరం చేరాల్సిన విమానం అనూహ్యంగా రాజమండ్రిలో ల్యాండింగ్ కావడంతో ప్రయాణికుల్లో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది.


రాజమండ్రి విమానాశ్రయంలో సుమారు 30 నిమిషాల పాటు ఉన్న అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఇండిగో విమానం తిరిగి గన్నవరం బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని రాజమండ్రికి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా గన్నవరం వైపు బయలుదేరారు.


ఇవి కూడా చదవండి:

‘సూపర్‌ సిక్స్‌’తో ఆర్థిక భద్రత

హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 12 , 2026 | 12:43 PM