Share News

కుట్రను వెలికితీయాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:41 AM

‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ అధినేత జగన్‌, ఎంపీ అవినాశ్‌ సహా భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల కుట్రను వెలికితీయాలి. వివేకా మరణంతో లబ్ధి పొందిన వారిని శిక్షించి తీరాలి.’’

కుట్రను వెలికితీయాలి

  • జగన్‌, అవినాశ్‌, భాస్కర్‌, శివశంకర్‌రెడ్డిని శిక్షించాలి

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డిబేట్‌లో సునీల్‌ యాదవ్‌

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ అధినేత జగన్‌, ఎంపీ అవినాశ్‌ సహా భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల కుట్రను వెలికితీయాలి. వివేకా మరణంతో లబ్ధి పొందిన వారిని శిక్షించి తీరాలి.’’ అని హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డిబేట్‌లో సునీల్‌ మాట్లాడుతూ.. జగన్‌, అవినాశ్‌, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి నుంచే తనకు ముప్పు ఉందని తెలిపారు. తాను వైసీపీ అడ్డా పులివెందులలో ఉన్నానని, జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మూడుసార్లు తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. అవినాశ్‌ సోషల్‌ మీడియాను నిర్వహించే వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై పులివెందులలో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ‘‘నాకు తెలిసిన ప్రతి విషయాన్నీ ఈడీకి చెప్పా. వాటిని బహిర్గతం చేయలేను. జైల్లో ఉన్నప్పుడు నన్ను బెదిరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే నేను బయటికి రాలేను. రానివ్వరు. నాకు హత్యతో సంబందం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు చేర్చడానికి కారణం ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలే.’’ అని సునీల్‌ యాదవ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 03:41 AM