Share News

బహుదాలో వరద తగ్గుమఖం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:47 AM

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వరద ముంపులో చిక్కుకున్న ఇచ్ఛాపురం ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది. బాహుదా నదితో పాటు బీమ సముద్రం, పద్మాపురం గెడ్డల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.

బహుదాలో వరద తగ్గుమఖం

ఇచ్ఛాపురం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వరద ముంపులో చిక్కుకున్న ఇచ్ఛాపురం ప్రాంతం సాధారణ స్థితికి చేరుకుంది. బాహుదా నదితో పాటు బీమ సముద్రం, పద్మాపురం గెడ్డల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. జాతీయ రహదారిపై వాహన రాకపోకలు పునఃప్రారంభం కాగా, ముంపు గ్రామాలకూ రాకపోకలు మొదలయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు ఇచ్ఛాపురం అతలాకుతలమైంది. బాహుదా నదిలోకి రికార్డు స్థాయిలో సుమారు 80 వేల క్యూసెక్కుల వరద చేరడంతో పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహుదా నది, బీమ సముద్రం, పద్మాపురం గెడ్డలు ఒకేసారి పొంగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. బాహుదా నదిలో నీటి ప్రవాహం సాయంత్రానికి బాగా తగ్గిపోవడంతో ముంపు ప్రాంతాల్లో రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. భారీవర్షాలకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం పాత బ్రిడ్జి వద్ద ఉన్న రహదారి శుక్రవారం ఉదయం తెగిపోయింది.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 02:53 AM