Share News

అక్రమంగా టోల్‌ వసూలు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:49 AM

‘టోల్‌గేట్‌’ వివాదంలో తన తప్పేమీ లేదని... హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టోల్‌ వసూలు చేయడంపైనే తాను ప్రశ్నించానని ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా తన సన్నిహితులతో పేర్కొన్నట్లు తెలిసింది.

అక్రమంగా టోల్‌ వసూలు!

  • దానిపై చర్చించేందుకే పిలిచాను

  • చిరుద్యోగులపై వేటు వేయాలనలేదు: కార్తికేయ మిశ్రా

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘టోల్‌గేట్‌’ వివాదంలో తన తప్పేమీ లేదని... హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టోల్‌ వసూలు చేయడంపైనే తాను ప్రశ్నించానని ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా తన సన్నిహితులతో పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని పరిధిలో సీడ్‌ యాక్సిస్‌ రహదారి సర్వీస్‌ రోడ్డు నుంచి టోల్‌గేట్‌ను చేరుకునే వారి నుంచి రుసుము వసూలు చేయరాదని ఉత్తర్వులు ఉన్నాయని ఆయన తన సన్నిహితులకు తెలిపారు. అయినప్పటికీ టోల్‌ వసూలు చేస్తున్నందునే సంబంధిత వ్యక్తులను పిలిచి మాట్లాడానన్నారు. అక్రమ టోల్‌ వసూలుకు బాధ్యలైన వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరానని... చిరుద్యోగులపై వేటు వేయడం తన అభిమతం కాదని తెలిపారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం


Updated Date - Nov 29 , 2026 | 02:51 AM