Share News

గడువుకు ముందే సముద్ర రత్నాకర్‌ రీఫిట్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:09 AM

విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌) మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. పరిశోధన నౌక సముద్ర రత్నాకర్‌ రీఫిట్‌...

గడువుకు ముందే సముద్ర రత్నాకర్‌ రీఫిట్‌

  • విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు మరో ఘనత

  • ఏడు నెలల వ్యవధిలో 11 నౌకలకు మరమ్మతులు

మల్కాపురం (విశాఖపట్నం), నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్ఎల్‌) మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. పరిశోధన నౌక సముద్ర రత్నాకర్‌ రీఫిట్‌ (మరమ్మతులు, ఆధునిక పరికరాలు అమర్చడం) పనులను నిర్ణీత గడువుకు ఐదు రోజుల ముందుగానే పూర్తిచేసింది. సముద్ర రత్నాకర్‌ నౌకలో అత్యాధునిక మల్టీబీమ్‌ ఎకో సౌండర్‌ వ్యవస్థను 15 రోజుల్లోనే ఏర్పాటుచేసింది. గతంలో ఇదేపనికి 30 రోజులు పట్టేది. నీటి అడుగుభాగంలోని 30 వాల్వులకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా 3వాల్వులు అమర్చింది. సాంకేతిక పరికరాలు, హైడ్రాలిక్‌ వ్యవస్థను పునరుద్ధరించింది.

మురుగునీటి శుద్ధి ప్లాంటు ట్యాంకును కొత్తగా ఏర్పాటుచేసింది. కేవలం 7నెలల వ్యవధిలో 11 నౌకలకు రీఫిట్‌ పనులు పూర్తిచేసింది. 2నెలల వ్యవధిలోనే ఐఎన్‌ఎస్‌ నిఫ్తార్‌, జలాశ్వ, బీపీటీ-2, ఎస్‌ఎ్‌సఎల్‌ శబరిమలై, ఎల్‌జీటీ నవ్యతో పాటు సముద్ర రత్నాకర్‌ నౌకల రీఫిట్‌ పనులను సంస్థ పూర్తిచేసింది. ఇంజనీరింగ్‌ నైపుణ్యం, ముందస్తు ప్రణాళిక, వనరుల సమర్థ వినియోగం, వివిధ విభాగాల సమన్వయంతోనే విజయాలు నమోదుచేశామని వెల్లడించింది. నౌకలు డాక్‌లో ఉండే సమయం తగ్గడంతో నిర్వహణ ఖర్చులు కలిసి వస్తున్నాయని, త్వరగా తిరిగి సముద్ర కార్యకలాపాలకు పంపే అవకాశం కలుగుతుండడంతో యజమానులకు ఆర్థికంగా లాభంగా ఉందని చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:11 AM