Share News

కోమాలో ఉన్న భర్తకు భార్యే చట్టబద్ధమైన సంరక్షకురాలు.. స్పష్టం చేసిన హైకోర్టు

ABN , Publish Date - Apr 24 , 2026 | 07:47 PM

కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుభాన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. అతడి బ్యాంకు ఖాతా నిర్వహణపై భార్య, ఇద్దరు పిల్లలు హైకోర్టును ఆశ్రయించారు.

కోమాలో ఉన్న భర్తకు భార్యే చట్టబద్ధమైన సంరక్షకురాలు.. స్పష్టం చేసిన హైకోర్టు
High Court judgement India

అమరావతి, ఏప్రిల్ 24: భారతీయ శాస్త్రాల్లో భార్యను అర్ధాంగిగా పరిగణిస్తారని, కోమాలో ఉన్న భర్తకు భార్యే చట్టబద్ధమైన సంరక్షకురాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త బ్యాంకు ఖాతా నిర్వహణకు భార్యను లీగల్ గార్డియన్‌‌గా గుర్తించింది. ఇంతకీ సంగతేంటంటే.. కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుభాన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. అతడి బ్యాంకు ఖాతా నిర్వహణపై భార్య, ఇద్దరు పిల్లలు హైకోర్టును ఆశ్రయించారు. తమలో ఒకరిని సంరక్షకులుగా నియమించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ జరిపింది.


సుభాన్ సింగ్ ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిర్వహణకు సంరక్షకురాలిగా భార్య నాగమ్మను నియమించింది. భవిష్యత్తులో ఇలాంటి కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా తీర్పు ప్రతిని న్యాయశాఖ కార్యదర్శికి పంపాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలో నిధులు బాధితుడి వైద్య అవసరాలకే వినియోగించాలని.. ఖర్చుల వివరాలతో అప్‌డేట్ చేసిన పాస్ బుక్ రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Updated Date - Apr 24 , 2026 | 08:08 PM