వనసమారాధనలో ఐఏఎస్ అధికారుల సందడి
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:48 AM
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 8 హెచ్‌వోడీ కార్యాలయాలు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో ఉమ్మడిగా కార్తిక వనసమారాధన నిర్వహించారు.
ఎకో పార్కులో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల ఆటపాటలు
మంగళగిరి సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 8 హెచ్‌వోడీ కార్యాలయాలు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్కులో ఉమ్మడిగా కార్తిక వనసమారాధన నిర్వహించారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన ఈ వేడుకలకు ఐదుగురు ఐఏఎస్ అధికారులు, 500 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది హాజరై సందడి చేశారు.
రోజువారీ విధుల ఒత్తిడికి విరామం ఇచ్చి, పచ్చని చెట్ల మధ్య ఆత్మీయ పలకరింపులు, ఆటపాటలు, క్రీడా పోటీలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు తమ పేర్లతో మొక్కలు నాటారు. ఐఏఎస్ అధికారులు సైతం క్రీడా పోటీల్లో పాల్గొని ఉద్యోగులతో కలిసి సందడి చేశారు. కాగా, వనసమారాధనలో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి సత్యకుమార్ ఢిల్లీ నుంచి ఫోను ద్వారా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఏటా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..