టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా అర్జా శ్రీకాంత్ నియామకం.. 4 రాష్ట్రాల్లో అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:52 PM
దేశంలో వివిధ రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయాలు పర్యవేక్షించే స్పెషల్ ఆఫీసర్‌గా డిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.
ఢిల్లీ, నవంబర్ 27: దేశంలో వివిధ రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేవాలయాలు పర్యవేక్షించే స్పెషల్ ఆఫీసర్‌గా డిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు ఆయన స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే అస్సాం, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో టీటీడీ వ్యవహారాలను సమన్వయం చేసే అదనపు బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొంది.
ఆలయాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలతోపాటు సమగ్రాభివృద్ధిపై అర్జా శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని ప్రభుత్వం వివరించింది. కనీసం 15 రోజులకు ఒకసారి ఈ ఆలయాలను తనిఖీ చేయాలని అర్జా శ్రీకాంత్‌ను ఆదేశించింది. దీంతో ఆయా దేవాలయాల్లో సమస్యలను గుర్తించి సిబ్బందికి టీటీడీ స్పెషల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తగిన దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ
సుప్రీంకోర్టు కొలీజియంపై మాజీ సీజేఐ బి.ఆర్.గవాయ్ అసంతృప్తి.. రాష్ట్రపతికి లేఖ