Share News

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..

ABN , Publish Date - Aug 09 , 2026 | 07:32 PM

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థిని మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..
Medical Student Priyanka

అమరావతి: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న యువతి ప్రాణాలు కోల్పోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

‘రాజమహేంద్రవరంలో యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్ర విచారం కలిగించింది. ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కఠిన సెక్షన్లతో నిందితులకు శిక్షలు పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

ఘోర విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి..

Updated Date - Aug 09 , 2026 | 07:40 PM