వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు.. ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం..
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:04 PM
గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఏలూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వారి వివరాలు తెలిస్తే చెప్పాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పొగాకు లోడుతో వెళుతున్న వాహనాన్ని బలవంతంగా తీసుకెళ్లడం, బాధితులను డబ్బు కోసం అపహరించడం, కులం పేరుతో దూషించడం వంటి ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ముస్తఫా, బషీర్ పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో వారి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని కోరుతూ నూజివీడు పోలీసులు సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.
ముస్తఫా, బషీర్ వివరాలు తెలిసిన వారు 9154876161, 9154876238 నంబర్లకు సమాచారం అందించి దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా, ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారు: సీఎం చంద్రబాబు