Share News

ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: చంద్రబాబు

ABN , Publish Date - Feb 14 , 2026 | 06:24 PM

పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారి పనితీరుకు సంబంధించిన నివేదికలను సీల్డ్ కవర్లలో ఇస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నివేదికల ద్వారా వారిని.. వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు..

ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: చంద్రబాబు
Chandrababu Naidu Reviews MLAs’ Performance

అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పాలనా శైలిపై మరోసారి స్పష్టత ఇచ్చారు. 1995-96లో తన పాలనలో ఉన్న నిక్కచ్చితత్వాన్ని మరోసారి పునరావృతం చేస్తానని ఆయన ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారికి సీల్డ్ కవర్లలో నివేదికలు ఇస్తున్నామని తెలిపారు. ఈ నివేదికల ద్వారా వారిని వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు.


పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం..

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. '1995-96 మాదిరిగానే నిక్కచ్చిగా ఉంటా. 9 అంశాల్లో సర్వే చేయించి నివేదికలు ఇస్తున్నా. సీల్డ్ కవర్లలో ఇచ్చే ఈ నివేదికల ద్వారా ఎమ్మెల్యేల పనితీరు, లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాం. మారకపోతే వాళ్లకే నష్టం' అని చంద్రబాబు అన్నారు. ఇక నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై అత్యంత కఠినంగా వ్యవహరించనున్నానని సీఎం పేర్కొన్నారు.

లోకేష్ పనితీరుపై ప్రశంసలు..

మంత్రి నారా లోకేష్ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. 'లోకేష్ పని లోకేష్ చేస్తున్నారు, నా పని నేను చేస్తున్నాను' అని స్పష్టం చేశారు. ముఖ్యంగా మంగళగిరి చేనేత చీరలకు లోకేష్ కల్పిస్తున్న అంతర్జాతీయ బ్రాండింగ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?

Updated Date - Feb 14 , 2026 | 06:57 PM