Share News

పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

ABN , Publish Date - Jun 20 , 2026 | 06:09 PM

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు.

పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
PM Kisan Annadata Sukhibhava Scheme Funds

పల్నాడు జిల్లా, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో ఈరోజు(శనివారం) విడుదల చేశారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.7 వేలు జమ చేశామని పేర్కొన్నారు. బటన్ నొక్కగానే 99.8 శాతం రైతులకు నిధులు జమయ్యాయని తెలిపారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.


జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు..

జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. విధ్వంసం నుంచి ఏపీని వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని వివరించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో రైతులకు అన్నీ కష్టాలే అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన.. 6 నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కాదని అన్నారు. ఇప్పుడు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని వివరించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా రైతుల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్నదాతలు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.


ప్రకృతి సేద్యం వైపు ప్రపంచం చూస్తోంది..

మళ్లీ ప్రకృతి సేద్యం వైపు ప్రపంచం చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులకు లాభసాటిగా ఉండాలని పామాయిల్‌ పంటను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పామాయిల్‌ పంటలో అంతర్గత పంటలూ వేసుకోవచ్చని చెప్పారు. మనం ప్రకృతి సేద్యం వైపు మారాలని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యాన్ని కాపాడుతామని అన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా తయారైందని వివరించారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానం తన జీవిత ఆశయమని ఉద్ఘాటించారు. నదుల అనుసంధానం జరిగితే ఏపీకి తిరుగుండదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్‌కు చెక్ పెట్టాం: హోం మంత్రి అనిత

మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 07:01 PM