రాజధానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ.. అమరావతిలో NIELIT క్యాంపస్
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:45 PM
రాజధాని అమరావతిలో మరో జాతీయ విద్య సంస్థను కేంద్రం ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలి క్వాంటమ్ - ఏఐ యూనివర్శిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రూ.730 కోట్లతో ఏర్పాటు కానుంది.
అమరావతి, ఆగస్టు 27: రాజధాని అమరావతిలో మరో జాతీయ విద్య సంస్థను కేంద్రం ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలి క్వాంటమ్ - ఏఐ యూనివర్శిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT)ని రూ.730 కోట్లతో ఏర్పాటు కానుంది. అమరావతిలో NIELIT క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అందుకోసం 8.5 ఎకరాల్లో కేటాయించింది.
అయితే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో NIELIT తరగతులు ప్రారంభం కానున్నాయి. NIELIT కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఫండ్‌లో సమకూర్చనుంది.