Share News

ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ పీజీ పరీక్షల్లో గుంటూరు విద్యార్థి ప్రతిభ

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:01 AM

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ పీజీ పరీక్షల్లో గుంటూరు నగరం గోరంట్లకు చెందిన డాక్టర్‌ జల్లేపల్లి శివసాయి విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం...

ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ పీజీ పరీక్షల్లో గుంటూరు విద్యార్థి ప్రతిభ

  • రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించిన శివసాయి

గుంటూరు మెడికల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ పీజీ పరీక్షల్లో గుంటూరు నగరం గోరంట్లకు చెందిన డాక్టర్‌ జల్లేపల్లి శివసాయి విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రేట్‌ ఈస్ట్రన్‌ మెడికల్‌ స్కూల్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ విద్యను అభ్యసించిన శివసాయి, విశ్వవిద్యాలయ పరీక్షల్లో 608 మార్కులు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

జల్లేపల్లి రవి, నాగకుమారి దంపతుల కుమారుడైన డాక్టర్‌ శివసాయి వైద్య విద్యలో చూపిన ప్రతిభ పట్ల కళాశాల అధ్యాపక బృందంతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శివసాయిని అభినందించి, వైద్యరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తన విజయానికి మార్గదర్శకత్వం వహించిన రేడియో డయాగ్నోసిస్‌ విభాగాధిపతి డాక్టర్‌ రూపేష్‌ మాండవతో పాటు అధ్యాపక బృందానికి శివసాయి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:03 AM